ఎంపీ రఘునందన్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దేశంలో కరోనా వ్యాపించిన నాటి నుంచి ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తున్న ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ జన్మదినం, 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధినేతగా ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్, ఉచిత వ్యాక్సినేషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన నిర్ణయాలతో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిని పెంచేలా చేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, బాసంగారి వెంకట్, కాసనిగొట్టు సంతోష్, విభీషణ్ రెడ్డి, తుంగ కనకయ్య, కొత్తపల్లి వేణుగోపాల్, గుండ్ల జనార్దన్, మీడియా ఇన్‌చార్జి గోనె మార్కండేయులు, పద్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు.


