● కలెక్టర్ హైమావతి
● బాలికల గురుకుల పాఠశాలసందర్శన
దుబ్బాకరూరల్: మండలంలోని రామక్కపేటలోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంటకాలను శుభ్రమైన కూరగాయలతో చేస్తున్నారా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళ మెనూ ప్రకారం స్నాక్స్ అందిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించక పోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


