ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం చేయొద్దు

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

దుబ్బాక: ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు రైస్‌మిల్లర్స్‌ దిగుమతులు వేగంగా చేపట్టి సహకరించాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. శుక్రవారం డీఎస్‌ఓ తనూజతో కలిసి దుబ్బాక, భూంపల్లి–అక్బర్‌పేట, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాల్లోని రైస్‌మిల్లుల్లో ధాన్యం దిగుమతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచి పనిచేయించాలన్నారు. దిగుమతిలో జాప్యం కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులను నియమించామన్నారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులు సన్నవడ్లను పండించాలని, సన్నాలకు 500 బోనస్‌ వస్తుందన్నారు. రేషన్‌ షాప్‌లలో సన్నబియ్యం సరిపోక ఇతర జిల్లాలనుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

కలెక్టర్‌ హైమావతి

రైస్‌మిల్లుల్లో ధాన్యం దించివేత పనుల పరిశీలన

Advertisement
 
Advertisement
Advertisement