వర్గల్(గజ్వేల్): గ్రేవ్ కేసులు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. మంగళవారం గౌరారంలోని గజ్వేల్ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సౌకర్యాలు, రికార్డుల నిర్వహణ, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. నూతనంగా ఏర్పాటు చేసిన 6 సీసీటీవీ కెమెరాలు, వాహన పార్కింగ్ షెడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, సీఐ రవిరాజు, ఎస్‌ఐలు ఆరోగ్యం, రఘుపతి, కృష్ణారెడ్డి, యూనుస్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్


