జహీరాబాద్ టౌన్: నిబంధనలు ఉల్లంఘిస్తే స్క్రాప్ దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని మున్సిపల్ చైర్మన్ యూనూస్, కమిషనర్ ప్రభాకర్ హెచ్చరించారు. మున్సిపల్ సమావేశ మందిరంలో పట్టణంలోని స్క్రాప్ దుకాణాల యాజమాన్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్, చైర్మన్లు మాట్లాడుతూ స్క్రాప్ దుకాణాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దుకాణాల వస్తువులు రహదారులు, ఫుట్‌పాత్‌పైకి రాకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్, రసాయనాలు, పెట్రోల్, డీజిల్ లాంటి మండే స్వభావం ఉన్న వ్యర్థాలను నిల్వ చేయరాదన్నారు. అనంతరం ఎస్‌ఐ లవకుమార్ మాట్లాడుతూ దొంగలించిన వస్తువులను కొనుగోలు చేయరాదన్నారు. అలాగే లైసెన్స్‌లు తప్పకుండా తీసుకోవాలని చెప్పారు.


