క్రీడల్లో గెలుపోటములు సహజం | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో గెలుపోటములు సహజం

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అస్మిత క్రీడలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం అన్నారు. మండలంలోని అంతక్కపేటలో శనివారం నిర్వహించిన అస్మిత ఉమెన్స్‌ లీగ్‌ సైకిల్‌ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఏసీపీ హాజరై పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు చేయూతనిచ్చేందుకే క్రీడా పోటీలు నిర్వహించి వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకేనని కొనియాడారు. క్రీడల్లో గెలుపు, ఓటములు అనేది సహజమన్నారు. మహిళా సైక్లింగ్‌ పోటీలకు 30మంది మహిళలు పాల్గొనడం గర్వకారణమన్నారు. అంతక్కపేట గ్రామ శివారులోని కట్కూర్‌ క్రాసింగ్‌ నుంచి అండర్‌–16, 18, 20 విభాగాల్లో 5, 10, 15కిలో మీటర్ల సైక్లింగ్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ ఐలయ్య, సర్పంచ్‌ సృజన్‌కుమార్‌, సైక్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కార్యదర్శి వెంకటనర్సయ్య, సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆర్థిక కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు రవీందర్‌, ఓం ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement