హెల్త్‌కార్డుల కోసం ఉద్యోగులు, పెన్షనర్లకు ఎదురుచూపులు తప్పడంలేదు. 2023 నుంచి నిరీక్షించాల్సిన పరిస్థితి మారలేదు. ప్రతిసారి చర్చలు జరపడం, హామీలివ్వడమే తప్ప పురోగతి లేదు. 2025 సెప్టెంబర్ 1న జేఏసీ నేతలతో సర్కార్ చర్చలు జరిపింది. వారంలో హెల్త్‌కార్డుల విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పింది. ఫిబ్రవరిలో క్యాబినెట్ కూడా పచ్చజెండా ఊపింది. 2వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో తప్ప ఎక్కడా ఉద్యోగులకు వైద్యం అందడంలేదు.
ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇచ్చేదెన్నడో?
జోగిపేట(అందోల్): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు జూన్ మాసంలో హెల్త్ కార్డుల పంపిణీ కార్యరూపం దాల్చలేదు. ఉద్యోగుల వేతనాల్లో 1.5 శాతం కోత విధించినా ఉచిత వైద్యం అందకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఈహెచ్‌ఎస్ ట్రస్టు ఏర్పాటు చేస్తామని, ఏడు రోజుల్లో మార్గదర్శకాలిస్తామని, పది రోజుల్లో కార్డులిచ్చి ఉచిత వైద్యాన్ని అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా నిలబెట్టుకోకపోవడంతో ఉద్యోగ సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1న ప్రభుత్వం హామీ ఇవ్వగా, 4వ తేదీకి గడువు ముగిసింది. 11వ తేదీ వచ్చింది. కానీ ఇంతవరకు ట్రస్టును ఏర్పాటు చేయలేదు. అలాగే ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో హెల్త్‌కార్డు ఇచ్చేదెప్పుడో? ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేదెప్పుడో? అని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం మే నుంచే ప్రీమియం పేరుతో కోత విధించింది. ఈ నెల ప్రీమియం చెల్లించినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉచిత వైద్యానికి నోచుకోలేకపోతున్నారు.
మే నెల వేతనంలోనే కోత
జూన్ 2 దాటినా కానరాని కార్డులు
ట్రస్టు కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వం
ఎదురు చూపులు


