ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్టతో పాటు పంప్‌హౌస్‌ను గురువారం ప్రాజెక్టు నూతన చీఫ్ ఇంజనీర్(సీఈ) సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా రేగొండ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌ను పరిశీలించి, ప్రాజెక్టు పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన ప్రొజెక్టర్ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయ్యాయో..ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను అడిగితెలుసుకున్నారు. చివరి దశలో పనులు ఎందుకు నిలిచిపోయాయి? భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇంకా ఇవ్వాల్సి ఉందా? తదితర వివరాలపై ఆరా తీశారు. ప్రాజెక్టు కట్టపై ఏర్పాటు చేసిన సీసీ కెమోరాలు ధ్వంసం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సుమతి దేవి, ఈఈ రాములునాయక్, డీఈఈ రఫీ తదితరులు పాల్గొన్నారు.


