దోస్త్‌కు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

దోస్త్‌కు వేళాయె..

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

ఏప్రిల్‌ 15 నుంచి మే 7 వరకు రూ.200 రుసుముతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

ఏప్రిల్‌ 30 నుంచి మే 5 వరకు

వెబ్‌ ఆప్షన్‌ నమోదు.

మే 7, 8వ తేదీల్లో వెరిఫికేషన్‌.

మే 14న మొదటి విడత

డిగ్రీ సీట్ల కేటాయింపు.

మే 15 నుంచి 23వ తేదీలోగా

కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టు చేయాలి

రెండో విడత : మే 15 నుంచి 25 వరకు..

మూడో విడత: మే 31 నుంచి జూన్‌ 15 వరకు దరఖాస్తులు.

అనంతరం జూలై 1వ తేదీ నుంచి

తరగతులు ప్రారంభం కానున్నాయి.

విద్యార్థులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఎలాంటి సందేహాలున్నా సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని దోస్త్‌ హెల్ప్‌ లైన్‌ ఫోన్‌ నం.79892 39115 ను సంప్రదించవచ్చు.

డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ షురూ.. రిజిస్ట్రేషన్‌లో సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌ మూడు విడతల్లో సీట్ల కేటాయింపు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: 2026–27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. దీని ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఈ నెల 15 నుంచి జూన్‌ 27 వరకు మూడు విడుతల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ, డీ ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మూడు విడుతల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తున్న క్రమంలో విద్యార్ధుల ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నంబర్‌ అనుసంధానమై ఉండాలి. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకొనే అవకాశం దోస్త్‌ కల్పిస్తోంది. www.dost.cff.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌ ఇలా..

జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా, 16 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4 వేల మంది విద్యార్థులుండగా, ప్రైవేట్‌ కళాశాలల్లో 17 వేలకు పైగా విద్యార్థులున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్మీడియెట్‌కు సంబంధించిన మార్కుల జాబితా, 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు టీసీతో పాటు, కులం, ప్రస్తుత సంవత్సరం ఆదాయం సర్టిఫికెట్‌ ఉండాలి. ఇదివరకే ఆధార్‌ అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ గల విద్యార్థులు నేరుగా దోస్త్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అనుసంధానం కాకుంటే తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఈ విద్యా సంవత్సరం దోస్త్‌ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్‌లోకి వెళ్లి విద్యార్థుల పూర్తి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

మొదటి విడత

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఇంటర్‌ పూర్తయిన విద్యార్ధులకు డిగ్రీలో నచ్చిన కోర్సులు, నచ్చిన కళాశాలలో చేరేందుకు ఇది సువర్ణావకాశం. ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు రిజిస్ట్రేషన్‌ సమయంలో సందేహాలుంటే హెల్ప్‌లైన్‌ కు ఫోన్‌న్‌ చేస్తే సందేహాలను నివృత్తి చేస్తారు.

– ప్రవీణ, ప్రిన్సిపాల్‌, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల

Advertisement
 
Advertisement
Advertisement