రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో మాజీ ఉపసర్పంచ్ మృతి చెందాడు. ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం... కౌడిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ దార దుర్గయ్య(75) శనివారం ఉదయం సొంతపనిపై తన స్కూటీపై జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్రాలీఆటో, స్కూటీ ఢీకొన్నాయి. దీంతో దార దుర్గయ్య కిందపడగా తల, శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడ్ని కౌడిపల్లి సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సూరారంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


