చంద్లాపూర్‌లో తొలి గ్రామ సభలోనే.. | - | Sakshi
Sakshi News home page

చంద్లాపూర్‌లో తొలి గ్రామ సభలోనే..

Feb 22 2026 8:39 AM | Updated on Feb 22 2026 8:39 AM

చంద్ల

చంద్లాపూర్‌లో తొలి గ్రామ సభలోనే..

మద్యానికి బానిసై ఆగం కావొద్దనే..

గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతుండటంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా తాగుతున్నారు. యువత మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలు మరిచి కట్టుకున్న భార్యను ఇబ్బందులకు గురి చేయడం, అప్పుల పాలు అవుతున్నారు. గ్రామ సభ తీర్మానాన్ని ధిక్కరించి మద్యం అమ్మితే మొదటి సారి రూ.50వేలు, రెండోసారి రూ.లక్ష జరిమానాతో పాటు పోలీసు కేసు పెట్టాలని తీర్మానం చేశాం.

–సురగోని శేఖర్‌ గౌడ్‌, సర్పంచ్‌, చంద్లాపూర్‌

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామంలో 4,572 మంది జనాభా ఉండగా.. గ్రామ పంచాయతీగా 1975లో ఏర్పాటైంది. జనవరి 26న జరిగిన తొలి గ్రామ సభలోనే గ్రామంలో మద్య నిషేధంపై తీర్మానించారు. బెల్ట్‌షాప్‌లు నిర్వహిస్తున్న వారికి నోటీసులిచ్చారు. యువత మద్యానికి అలవాటు పడి గొడవలు పెట్టుకోవడం, భార్యాభర్తలకు విడాకులు ఇవ్వడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. దీంతో గ్రామస్తులందరూ ఏకమై ఈ తీర్మానం చేశారు.

చంద్లాపూర్‌లో బెల్ట్‌షాప్‌ నిర్వాహకులకు నోటీసులు అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శి

చంద్లాపూర్‌లో తొలి గ్రామ సభలోనే..1
1/2

చంద్లాపూర్‌లో తొలి గ్రామ సభలోనే..

చంద్లాపూర్‌లో తొలి గ్రామ సభలోనే..2
2/2

చంద్లాపూర్‌లో తొలి గ్రామ సభలోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement