ఇళ్ల స్థలాలు ఇప్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాలు ఇప్పించాలి

Feb 22 2026 8:39 AM | Updated on Feb 22 2026 8:39 AM

ఇళ్ల

ఇళ్ల స్థలాలు ఇప్పించాలి

సంగారెడ్డి జోన్‌: సంగారెడ్డి మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని అంబేడ్కర్‌ కాలనీలో నివాసముంటున్న తమ ఇళ్ల స్థలాలు తమకే ఇప్పించాలని కోరారు. శనివారం కలెక్టరేట్‌లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంలో కొన్నేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకునేందుకు కేటాయించారు. కానీ ఆ సమయంలో మౌలిక వసతులు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయామన్నారు. గత నెల 29న నివాసం ఉండేందుకు గుడిసెలు వేసుకున్నామని చెప్పారు. కానీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెలు, జెండాలను ధ్వంసం చేశారన్నారు. అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.

సీఎం కప్‌ పోటీలకు

విద్యార్థుల ఎంపిక

మిరుదొడ్డి(దుబ్బాక): సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు మిరుదొడ్డి గ్రామానికి చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ఉమ్మడి మెదక్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భైరయ్య తెలిపారు. ఈ నెల 22, 23వ తేదీల్లో ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో మద్దెల ప్రణయ్‌, వేముల సిద్ధార్ధ, ఎర్రమైన సిద్ధార్థ, మన్నె తరుణ్‌ వర్షిత్‌, మద్దెల రాకేశ్‌, వనం సంపత్‌, మన్నె విష్ణు, రంగనమైన నిశాంత్‌ వర్ధన్‌, కాసారం హర్షవర్ధన్‌, వర్షిత్‌ గౌడ్‌, సిద్దాల అజయ్‌ పాల్గొంటారని తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం..

రాగి వైరు చోరీ

చేర్యాల(సిద్దిపేట): విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని రాగి వైరును ఎత్తుకెళ్లారు. మండల పరిధిలోని తాడూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. రైతులు, పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వంగ సురేందర్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద ఉన్న 25 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న రాగి వైరు ఎత్తుకెళ్లారు. గమనించిన రైతు దుద్దెడ నర్సింహులు విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి, చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌ టీం వచ్చి వివరాలు సేకరించింది. సీఐ రమేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఈత చెట్ల నరికివేతపై కేసు

వర్గల్‌(గజ్వేల్‌): మండలంలోని మజీద్‌పల్లిలో ఈత చెట్ల నరికివేతపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్‌ ఎస్‌ఐ సాయికృష్ణ తెలిపారు. గ్రామ సబ్‌స్టేషన్‌ సమీపంలో జీవనోపాధిగా నిలుస్తున్న ఈతచెట్లను నరికివేశారని శనివారం గౌడసంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విత్తన శుద్ధిపై అవగాహన

దుబ్బాకరూరల్‌: బాబుజగ్జీవన్‌రామ్‌ వ్యవసా య కళాశాల, రాజన్నసిరిసిల్ల జిల్లా విద్యార్థు లు మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో రైతులకు విత్తన శుద్ధిపై అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి అనగా విత్తనాలను విత్తే ముందు సిఫార్సు చేసిన రసాయనాలతో శుద్ధి చేయడమని, దీని వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే రోగాలను కాడ కుళ్లు, వేరు కుళ్లు, విత్తన కుళ్లు పడి పోవడం, పొడి పూత, తొడ కుళ్లు, తెల్ల పూత, ఆకు పచ్చరోగం నియంత్రిచవచ్చన్నారు. ప్రదర్శనలో భాగంగా కార్బెండాజిమ్‌, మాంకొజెబ్‌ కిలో విత్తనానికి 2.5 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసే విధానాన్ని వివరించారు. ప్రారంభ దశలో పంట పెట్టుబడి తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ఇళ్ల స్థలాలు ఇప్పించాలి  1
1/1

ఇళ్ల స్థలాలు ఇప్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement