పల్లెలు సమరం | - | Sakshi
Sakshi News home page

పల్లెలు సమరం

Feb 22 2026 8:39 AM | Updated on Feb 22 2026 8:39 AM

పల్లె

పల్లెలు సమరం

పల్లెలు సమరం ● తొలి గ్రామ సభల్లోనే ముందడుగు ● బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే జరిమానాలు ● ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు

మద్యానికి దూరం..
మద్యపానం నిషేధిస్తూ తీర్మానాలు
● తొలి గ్రామ సభల్లోనే ముందడుగు ● బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే జరిమానాలు ● ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు

అమ్మితే రూ.లక్ష జరిమానా..

గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలంటే గ్రామంలో మద్యం అమ్మవద్దని తీర్మానం చేశాం. ఎవరైనా ధిక్కరించి మద్యం అమ్మితే వారికి రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించాం. మద్మం అమ్ముతున్నట్లు ఎవరైనా సమాచారం అందిస్తే వారికి రూ.10వేల బహుమతి ఇస్తాం.

–మాధవనేని బాను ప్రసాద్‌, సర్పంచ్‌,

బొప్పాపూర్‌

బొప్పాపూర్‌లో తీర్మానం

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని బొప్పాపూర్‌ 1995లో గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. ఈ గ్రామంలో మొత్తం జనాభా 832 మంది ఉన్నారు. స్థానిక మహిళల కోరిక మేరకు గతేడాది డిసెంబర్‌ 22న తొలి గ్రామ సభలోనే మద్యపాన నిషేధంపై తీర్మానం చేశారు. గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు అందజేశారు.

మద్యపానం.. సమాజాన్ని నాశనం చేసే మహమ్మారుల్లో ముందు వరుసలో ఉంటుంది. దేశవ్యాప్తంగా మద్యం బాధితులు కోట్లలో ఉన్నారు. నేడు మన సమాజంలో జరిగే అనేక నేరాలు, దారుణాలకు మద్యమే ప్రధాన కారణం. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్తులే ఏకమై మద్యపాన నిషేధానికి నడుం బిగిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపుల వల్ల యువత చెడి పోతున్నారని నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామంలో బెల్ట్‌షాపుల భరతం పట్టాలని సంకల్పించారు. దీంతో గ్రామాల్లో నూతన పాలక వర్గాలు గ్రామ సభల్లో మద్యపాన నిషేధంపై తీర్మానాలు చేస్తుండటంపై ఈ వారం కథనం.

–సాక్షి, సిద్దిపేట

మ్మడి మెదక్‌ జిల్లాలో 1,613 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామంలో మహిళల విజ్ఞప్తితో పాటు, గ్రామ సర్పంచ్‌ పట్టుదలతో మద్యపాన నిషేధంపై తీర్మానాలు చేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో బెల్ట్‌షాప్‌లను నియంత్రించారు. గ్రామాల్లో కిరాణ షాపులలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఇలా ఒక గ్రామాన్ని చూసి మరో గ్రామంలో ఒక్కొక్కటిగా గ్రామ పంచాయతీల్లో మద్యపాన నిషేధం వైపు అడుగులు పడుతున్నాయి.

జిల్లా గ్రామాల సంఖ్య

సిద్దిపేట 508

సంగారెడ్డి 613

మెదక్‌ 492

పల్లెలు సమరం1
1/2

పల్లెలు సమరం

పల్లెలు సమరం2
2/2

పల్లెలు సమరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement