తండ్రిని హత్య చేసిన నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

తండ్రిని హత్య చేసిన నిందితుడి అరెస్టు

Feb 22 2026 8:39 AM | Updated on Feb 22 2026 8:39 AM

తండ్రిని హత్య చేసిన నిందితుడి అరెస్టు

తండ్రిని హత్య చేసిన నిందితుడి అరెస్టు

చేగుంట(తూప్రాన్‌): రెండేళ్ల క్రితం తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. శనివారం రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్‌ కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని జెత్రం తండాకు చెందిన నామా నాయక్‌కు ముగ్గురు కొడుకులు. అతడి పేరున ఉన్న కొంత భూమిని ఇద్దరు కుమారులు రమేశ్‌, లక్ష్మణ్‌ అమ్ముకునేందుకు తండ్రి సహకరించాడు. రెండో కొడుకు రాజేందర్‌ సైతం కొంత భూమిని తన పేరున చేయాలని లేదా కొంత భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని కోరగా మద్యానికి బానిసైన అతడికి భూమి ఇవ్వలేదు. దీంతో తండ్రిపై కోపంతో 2024 అక్టోబర్‌ 27న రాత్రి సమయంలో నామానాయక్‌తో కుమారుడు రాజేందర్‌ మద్యం కోసం డబ్బులు కావాలని గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇటుకరాయితో దాడి చేయగా నామానాయక్‌ కిందపడిపోయాడు. తండ్రి చనిపోయాడనుకొని తన సోదరులకు విషయం తెలిస్తే వారు వదిలిపెట్టరని రాజేందర్‌ భయంతో పారిపోగా అప్పటి నుంచి నిందితుడి ఆచూకీ లభించలేదు. తలకు గాయమైన నామానాయక్‌ చికిత్స పొందుతూ ఎనిమిదిరోజుల తర్వాత మృతి చెందాడు. అప్పట్లో చేగుంట పోలీస్‌ స్టేషన్‌లో రాజేందర్‌పై కేసు నమోదు కాగా నిందితుడు విజయవా డలో ఓ అన్నదాన సత్రంలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. శనివారం రాజేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement