భూసేకరణ వేగవంతం చేయాలి
సంగారెడ్డి జోన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు అవుతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, టీజీఐఐసీ, నిమ్జ్ అధికారులతో భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో మిగిలిపోయిన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొరకు అవసరమైన భూమిని ఇప్పటికే 93 శాతం భూమిని స్వాధీనం చేసుకొని అప్పగించినట్లు చెప్పారు. మిగతా భూమిని సంబంధిత ప్రతినిధులకు అప్పగించాలని కోరారు. ప్రాజెక్టు అభివృద్ధి కొరకు భూమిని సేకరించి సకాలంలో పరిహారం అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ప్రాజెక్టు ప్రత్యేక అధికారి విశాలాక్షి, టీజీఐఐసీ జోనల్ మేనేజరు రతన్ రాథోడ్, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య


