పట్టుదలతో చదివి..
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండలం ముసాపేట గ్రామానికి చెందిన ఎరగారి ప్రభాత్‌రెడ్డి గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన ఎరగారి శశింధర్‌రెడ్డి , పావనీలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభాత్‌రెడ్డి గత రెండు నెలల క్రితం వెల్లడైన గ్రూప్–4 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ సాధించి ప్రస్తుతం జిల్లాలోని కొల్చారం మండలం రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన విద్యాభ్యాసం మెదక్‌లోని సిద్ధార్థ మోడల్‌స్కూల్‌లో 10 వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని శ్రీనిఽధి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. మూడేళ్లుగా అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉండి చదువుకున్నారు. దీంతో పాటు గ్రూప్–3లో కూడా 800 వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అతడిని గ్రామస్తులు, కుటుంబసభ్యులు, బంధువులు అభినందించారు.


