పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Jan 17 2026 11:44 AM | Updated on Jan 17 2026 11:44 AM

పెండి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

నారాయణఖేడ్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి డిమాండ్‌ చేశారు. సంఘం ఖేడ్‌ డివిజన్‌ స్థాయి సమావేశం శుక్రవారం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌ బిల్లులన్నీ ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి నెలలవారీగా విడుదల చేస్తూ కాలయాపన చేయడం తగదన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల ఏరియర్స్‌ బిల్లులను ఇంతవరకు విడుదల చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, డివిజన్‌ పరిధిలోని మండలాల బాధ్యులు మశ్చందర్‌, కిరణ్‌ కుమార్‌, రంజిత్‌ కుమార్‌, మహేశ్‌, ప్రవీణ్‌ జాదవ్‌, యోగేశ్వర్‌, రాజశేఖర్‌, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

రోడ్డు నియమాలు పాటించాలి

సంగారెడ్డి టౌన్‌, సంగారెడ్డి క్రైమ్‌: రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్‌ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సావాల్లో భాగంగా శుక్రవారం సంగారెడ్డి డిపోలోని ఆర్‌టీసీ డ్రైవర్లకు, డిపో సిబ్బందికి ‘అరైవ్‌ అలైవ్‌’అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్యగౌడ్‌ మాట్లాడుతూ...అతివేగం ప్రమాదకరమన్నారు. జాతీయ రహదారులపై వాహనాలను ఓవర్‌ టేక్‌ చేసే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బస్సులను ఎడమ వైపు మాత్రమే నిలపాలని సూచించారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణారెడ్డి, డిపో మేనేజర్‌ ఉపేందర్‌ పాల్గొన్నారు.

వైద్య కళాశాల క్రీడా

ప్రాంగణానికి భూమి పూజ

సంగారెడ్డి: సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు క్రీడా సౌకర్యాలను కల్పించేందుకు శుక్రవారం భూమి పూజ చేశారు. హెటెరో గ్రూప్‌ సహకారంతో కంపెనీ ప్రతినిధుల పర్యవేక్షణలో రూ.1.50కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌–ప్రిన్సిపాల్‌, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయస్థాయి

కబడ్డీ పోటీలకు విద్యార్థి

జిన్నారం (పటాన్‌చెరు): జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు బొల్లారం ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎంపికై ందని ప్రిన్సిపాల్‌ శ్రీదేవి పేర్కొన్నారు. కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నిషా కుమారి ఎంపికై ందని తెలిపారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాఠశాల తరఫున ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. జాతీయస్థాయికి ఎంపిక కావడంపై విద్యార్థినిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

సీనియర్‌ అసిస్టెంట్‌గా

ఎంపికై న వార్డు అధికారి

సంగారెడ్డి క్రైమ్‌: జిల్లాలోని కంగ్టి మండలానికి చెందిన నరసింహారెడ్డి సీనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. 2024లో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియామకమైన ఆయన సంగారెడ్డి మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా నిర్వహించిన గ్రూప్‌–3లో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని హైదరాబాద్‌లో శుక్రవారం అందుకున్నారు. సంగారెడ్డిలోని ట్రెజరీ శాఖలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి1
1/4

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి2
2/4

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి3
3/4

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి4
4/4

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement