పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య
రామచంద్రాపురం(పటాన్‌చెరు): సౌతిండియా సైన్స్ ఫెయిర్‌కు దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరవుతారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రామచంద్రాపురం మండల పరిధిలోని వెలిమెల గాడియం ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సౌతిండియా సైన్స్ ఫెయిర్–2026 ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సౌతిండియా సైన్స్ ఫెయిర్‌కు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, నోడల్ అధికారి లింబాజీ, తహసీల్దార్ సరస్వతి, ఎంఈఓలు నాగేశ్వర్ నాయక్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సౌతిండియా సైన్స్ ఫెయిర్‌పై కలెక్టర్


