పోలీసుల అదుపులో నిందితుడు
కొండపాక(గజ్వేల్): అంబేడ్కర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన వ్యక్తిని కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కొండపాక మండలంలోని దమ్మక్కపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ కథనం మేరకు.. దమ్మక్కపల్లి గ్రామంలో కొన్ని నెలల కిందట అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కానీ ఆవిష్కరణ చేయలేదు. ఈ క్రమంలో జింక తిరుపతి అనే వ్యక్తి విగ్రహ గద్దైపె కూర్చోని కట్టెతో చేయిపై కొట్టడంతో పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు విషయం పోలీసులకు చెప్పడంతో ఎస్సై శ్రీనివాస్ విగ్రహాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి గ్రామంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.


