కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడతాం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడతాం

Published Thu, Apr 18 2024 10:30 AM

ప్రైవేటు ఆస్పత్రిలో ప్రజలకు
అవగాహన కల్పిస్తున్న ఫైర్‌ సిబ్బంది  - Sakshi

అగ్నిప్రమాదాల నివారణపై అప్రమత్తం
సిద్దిపేట ఫైర్‌ ఇన్‌చార్జి అధికారి నరేష్‌
● ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ● గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రచార రథాలు

సిద్దిపేటకమాన్‌: వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జి అధికారి నరేష్‌ సూచించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని సిబ్బంది, ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణపై బుధవారం ఫైర్‌ సిబ్బందితో కలిసి ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వారం రోజులుగా అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాద సమయంలో తీసుకునే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పట్టణంలోని ఆస్పత్రులు, ఆర్టీసీ బస్టాండ్లు, జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించామని వెల్లడించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్లప్పుడూ అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలన్నారు. పట్టణంలో ఎక్కువగా విద్యుత్‌, ఎలక్ట్రికల్‌ ఉపకరణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున ఐఎస్‌ఐ మార్క్‌ కలిగిన వైర్లు, ఉపకరణాలను ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో షాపుల్లో విద్యుత్‌ సరఫరా నిలిపి వేయాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌ నరేష్‌, ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది సంపత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

గజ్వేల్‌: కేసీఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మెదక్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీని అందిస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గజ్వేల్‌లో పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకుందని చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి మంజూరైన రూ.150 కోట్ల అభివృద్ధి పనులను ఆ పార్టీ నేతలు రద్దు చేశారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్‌లో బలమైన ప్రజా గొంతుకగా మారతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్‌ ఊడెం కృష్ణారెడ్డి, జగదేవ్‌పూర్‌ సహకార సంఘం చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, గజ్వేల్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు కిషన్‌రెడ్డి, గుంటుకు రాజు, గంగిశెట్టి రవి, కౌన్సిలర్లు బాలమణి, బొగ్గుల చందు, అత్తెల్లి శ్రీనివాస్‌, అహ్మద్‌, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు.

ప్రచార రథాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు
1/1

ప్రచార రథాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు

Advertisement
 
Advertisement