అప్పులు తీర్చే మార్గం లేక.. | - | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చే మార్గం లేక..

Published Thu, Feb 8 2024 5:52 AM | Last Updated on Thu, Feb 8 2024 11:27 AM

కృష్ణాగౌడ్‌ (ఫైల్‌) - Sakshi

కృష్ణాగౌడ్‌ (ఫైల్‌)

రాయపోలు(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాయపోలు మండలం బేగంపేటలో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్‌కుమార్‌ కథనం పక్రారం.. గ్రామానికి చెందిన బయ్యారం కృష్ణాగౌడ్‌ (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకులో లోన్‌ తీసుకుని ఇల్లు కట్టాడు. కిస్తీలు కట్టేందుకు సతమతమవుతున్నాడు కొంతకాలంగా దిగాలుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తూప్రాన్‌కు వెళ్తున్నట్లు చెప్పి బయటికెళ్లి గడ్డి మందు తాగాడు. మధ్యాహ్నం ఫోన్‌ చేసి భార్య వర్షకు అప్పులు తీర్చే మార్గం దొరక్క జీవితంపై విరక్తితో ఈ ఘాతుకానికి పాల్పడ్డానని చెప్పాడు. వెంటనే ఇంటికి తిరిగొచ్చి వాంతులు చేసుకుంటే వెంటనే గ్రామస్తుల సహాయంతో గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

భార్య మృతిని తట్టుకోలేక.. మద్యానికి బానిసై

గజ్వేల్‌రూరల్‌: ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బూర్గుపల్లిలో చోటు చేసుకుంది. గజ్వేల్‌ ఎస్‌ఐ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జనగామ నర్సింహులు(33) భార్య ఏడాది క్రితం మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేక మానసిక వేదన గురైన అతను మద్యానికి బానిసయ్యాడు. బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మద్యం తాగొద్దన్నందుకు..మనోహరాబాద్‌(తూప్రాన్‌): మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన దీపక్‌ భారతి (35) తన కుటుంబంతో కలిసి మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో అద్దె కుంటున్నాడు. ఇక్కడే ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు తాగొద్దన్నందుకు గాను మనస్తాపం చెంది బుధవారం అద్దె ఇంట్లో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య పూజ, ఇద్దరు కుమారులున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

పెళ్లి కావడం లేదని తనువు చాలించాడునంగునూరు(సిద్దిపేట):

పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కోనాయిపల్లికి చెందిన రజినీకర్‌రెడ్డి (38) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం కావడం లేదని బాధతో మద్యానికి బానిసయ్యాడు. రెండు రోజుల కిందట గ్రామానికి చేరుకున్న అతడు శివారు ప్రాంతంలోని నిమ్మ బాల్‌రెడ్డి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అందులో మృతదేహాన్ని గుర్తించిన జిడ్డి ప్రవీణ్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు.. గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

నర్సింలు(ఫైల్‌)1
1/1

నర్సింలు(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement