సౌత్‌ జోన్‌ యోగా పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సౌత్‌ జోన్‌ యోగా పోటీలకు ఎంపిక

Jan 26 2024 6:00 AM | Updated on Jan 26 2024 8:03 AM

గజ్వేల్‌రూరల్‌: ఖేలో ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్‌జోన్‌ యోగా పోటీలకు గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పీఈటీ గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27, 28 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్‌లో గల పీఎస్‌ఎన్‌ఏ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఖేలో ఇండియా సౌత్‌ జోన్‌ ఉమెన్స్‌ యోగా పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో అంకిత, వైష్ణవి పాల్గొంటారని పేర్కొన్నారు.

నాణాలతో త్రివర్ణ పతాకం

గజ్వేల్‌రూరల్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్‌ పట్టణానికి చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు త్రివర్ణ పతాకం ఆకారాన్ని రూపొందించారు. రూ. 33 వేల విలువ చేసే నాణెంలతో 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో త్రివర్ణ పతాకం రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

తేనె టీగల దాడి

15 మందికి గాయాలు

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండల కేంద్రంలో తేనెటీగల దాడిలో 15 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలోని చెట్టుకింద వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తులు కూర్చున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా తేనె టీగలు దాడి చేయడంతో అక్కడ కూర్చున్నవారు గాయపడ్డారు. ఇదే సమయంలో హాస్టల్‌ విద్యార్థులు భోజనం ముగించుకొని బయటకు రాగా తేనెటీగల దాడి కి గురయ్యారు. వెంటనే 108 అంబులెన్స్‌లో పీహెచ్‌సీ తరలించి వైద్యం అందించారు. ఇందులో నలుగురు విద్యార్థులు, నలుగురు స్థానికు లు ఉన్నారు. నార్సింగి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవికుమార్‌ మాట్లాడుతూ.. తేనెటీగల దాడిలో గాయపడి ఆస్పత్రికి వచ్చిన విద్యార్థులతోపాటు ఇతరులకు వైద్యం అందించామన్నారు.

ఆటోను ఢీకొట్టిన బస్సు

పటాన్‌చెరు టౌన్‌: ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ చౌరస్తాలో గురువారం ఉదయం ఓ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న తాత్కాలిక దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయలు తీసుకెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. డ్రైవర్‌ సత్యనారాయణకు తీవ్రగాయాలు కావడంతో పటాన్‌చెరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement