అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కాషాయ జెండాలకు గిరాకీ పెరిగింది. జహీరాబాద్ పట్టణంలో జోరుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. 500 ఏళ్ల కల సాకారమవుతున్న వేళ రాముడు, హనుమంతుడి బొమ్మలు కలిగి ఉన్న జెండాలను ఇంటిపై ఎగురవేసేందుకు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. యువజన సంఘాలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. జెండాల సైజులను బట్టి రూ.50 నుంచి రూ.1000 వరకు లభిస్తున్నాయి. – జహీరాబాద్ టౌన్