తాను చనిపోతూ.. పలువురికి వెలుగునిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

తాను చనిపోతూ.. పలువురికి వెలుగునిస్తూ..

Dec 30 2023 5:46 AM | Updated on Dec 30 2023 10:19 AM

- - Sakshi

రాయికోడ్‌(అందోల్‌): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌తో మృతిచెందాడు. తాను చనిపోతూ అవయవదానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈ సంఘటన రోయికోడ్‌ మండల పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. రాయిపల్లికి చెందిన బి.బీరప్ప (28) ఓ ప్రైవేటు పైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగి. అతను మూడురోజుల క్రితం జహీరాబాద్‌కు ఓ పని నిమిత్తం బైక్‌ తీసుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో ఝరాసంగం మండలం కుడిసంగం సమీపం వద్ద రోడ్డు ప్ర మాదానికి గురయ్యాడు.

దీంతో అతడి తలకు తీవ్ర గాయలైంది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం జహీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న అపోలోలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించారు. అతడి అవయవాలను దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై కుటుంబీకులకు అవగాహన కల్పించారు. దీనికి వారు ఒప్పుకోగా బీరప్ప లీవర్‌, కిడ్నీలను ఇతర పేషంట్లకు అమర్చుతున్నట్లు డాక్టర్లు చెప్పినట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement