
శివాని(ఫైల్)
సంగారెడ్డి: కుటుంబ సమస్యలతో గొడవపడిన భార్య కనిపించకుండా పోయిన ఘటన సోమవారం నర్సాపూర్ మండలం గంగారాం తండాలో చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన గృహిణి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన జర్పుల బుజ్జి కుమార్తె శివానిని సలాబత్ తండాకు చెందిన చంద్రకాంత్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేశారు. భర్తతో కుటుంబ సమస్యలపై గొడవ పడిన శివాని తల్లి గారింటి వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందని శివాని తల్లి బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు.