పోలీస్‌ ఉద్యోగం వద్దన్నందుకు వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఉద్యోగం వద్దన్నందుకు వివాహిత ఆత్మహత్య

Sep 17 2023 6:34 AM | Updated on Sep 17 2023 11:30 AM

- - Sakshi

నంగునూరు(సిద్దిపేట): ఉద్యోగం చేయొద్దన్నారని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి గట్లమల్యాలలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా వీనవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన మార్త రాజయ్య కూతురు కల్యాణి(24)తో గట్లమల్యాలకు చెందిన కారు హరీష్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.

ఎంబీఏ పూర్తి చేసిన కల్యాణి వివిధ పోటీ పరీక్షలు రాయగా కానిస్టేబుల్‌ ఉద్యోగానికి అర్హత సాధించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా పూరైంది. పోలీస్‌ ఉద్యోగం వద్దని భర్త హరీష్‌, అత్త రమణ, మరిది శ్రీహరి కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన కల్యాణి శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు. కాగా కల్యాణి రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement