China: రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా

China real estate companies Bankrupt which way - Sakshi

రుణాల ఎగవేతలో చైనా రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. మొత్తం మీద పాతిక్కి పైగా కంపెనీలు  తాము జారీ చేసిన బాండ్లకు చెల్లింపులు చేయకుండా  చేతులెత్తేసినట్లు  సమాచారం. మరి కొన్ని కంపెనీలు అనుకున్న షెడ్యూల్ సమయానికి ఇవ్వకుండా నాన్చి ఆలస్యంగా చెల్లింపులు చేశాయిదీంతో వినియోగదారులు  తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారుషాంఘైకి చెందిన షిమో  గ్రూప్ రియల్ కంపెనీ బిలియన్ డాలర్ల విలువ జేసే బాండ్లకు వడ్డీయే కాదు అసలు కూడా ఎగ్గొట్టింది. (చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది?)

చైనాలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన షిమోయే  ఇలా ఎగ్గొడితే ఇక చిన్నా చితకా రియల్ కంపెనీల సంగతేంటి? అని ఆర్ధిక రంగ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. కంపెనీకు 5.5 బిలియన్ డాలర్ల మేరకు విదేశీ అప్పులూ ఉన్నాయి. ఎవర్ గ్రాండే సంక్షోభం వెలుగులోకి వచ్చిన తర్వాత  జింగ్ పింగ్ ప్రభుత్వం  రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆంక్షలను కఠిన తరం చేయడంతో చాలా రియల్ కంపెనీలు దివాళా దిశగా పయనిస్తున్నాయి.

జిన్ పింగ్ చైనా అధ్యక్షుడు అయ్యాక  దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వాయు వేగంతో పెరిగిపోయింది. ఏకంగా 600 శాతం మేరకు పెరిగిపోయింది. దీనికి కారణం మితిమీరిన ప్రమోషన్లే. ఆకర్షణీయమైన వెంచర్లను ప్లాన్ చేస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను  ఆశ్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో అప్పులు సమీకరిస్తోన్న రియల్ వ్యాపారులు  తమ ఇళ్లు అమ్ముడు పోక తమకు రావల్సిన డబ్బులు చేతికి రాక పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నిర్దాక్షిణ్యంగా బోర్డులు తిప్పేస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ పెట్టుబడి దారులూ నష్టపోవలసి వస్తోంది.

నిజానికి 1998 వరకు చైనాలో  ఇళ్ల విక్రయాలపై కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. అప్పట్లో మూడింట ఒక వంతు మాత్రమే నగరాల్లో ఉండేవారు. తర్వాత నిబంధనలు సరళీకృతం చేయడంతో నగరీకరణ వేగం పుంజుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో చోటుచేసుకున్న సంక్షోభం చైనా పాలకులకు నిద్ర లేకుండా చేస్తోందిఎందుకంటే  రియల్ వ్యాపారం ఢమాల్ మంటే అది చైనా ఆర్ధిక వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది.

(ఇంకా ఉంది..పడిపోతున్న ప్రాపర్టీ మార్కెట్‌ను రక్షించే ప్రయత్నాల్లో "బిల్డ్, పాజ్.. డిమాలిష్‌..రిపీట్‌ " విధానాన్ని అవలంబించిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వరస కథనాలు )

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top