● నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి
● అచ్చంపేటలో సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపు
ఆమనగల్లు, కడ్తాల్: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. బుధవారం కడ్తాల్‌లో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేస్తారన్నారు. అనంతరం అచ్చంపేట్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సీఎం సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సభకు కడ్తాల్ నుంచి జనసమీకరణ చేసి, సభకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్, సర్పంచ్ రవి, నాయకులు రాజేశ్, బీచ్యానాయక్, రాజు, హీరాసింగ్, లక్పతినాయక్, విక్రాంత్, మల్లేశ్‌గౌడ్, రాంచందర్‌నాయక్, బాలరాజు, ఇక్బాల్, జహంగీర్‌అలీ, చెన్నయ్య, మోహన్, లక్ష్మన్, మోహన్, పవన్, మణి తదితరులు ఉన్నారు.
ఎంపీకి ఘన స్వాగతం
గిరిజనుల సంక్షేమం, ఆత్మగౌరవం పెంపే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అచ్చంపేట పట్టణంలో గురువారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. బుధవారం అచ్చంపేటకు వెళ్తున్న ఎంపీ మల్లు రవికి ఆమనగల్లులో ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ టెలికాం బోర్డు సభ్యులు వస్పుల జంగయ్య ఆధ్వర్యంలో ఎంపీని సన్మానించారు. మద్దిమడుగులో గిరిజనుల ఆరాధ్యదైవం సంత్‌సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ జంగయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శివలింగం, పీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, నాయకులు కాసోజు రాము, మైసయ్య, వర్కాల శ్రీను, శ్రీనివాస్, బొబ్బిలి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


