విద్యా వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోంది. హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు స్వగ్రామానికి ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రభుత్వం మంజూరు చేయడం అభినందనీయం. పేద విద్యార్ధులకు మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
– వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో విద్యార్ధులకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించనుంది.
– మనోహర్, ఎంఈఓ, ఫరూఖ్‌నగర్


