స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి వ్యక్తి మృతి

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

● స్నానానికి దిగిన సమయంలో మూర్ఛ రావడంతో ప్రమాదం

● కేసు నమోదు చేసిన చేవెళ్ల పోలీసులు

చేవెళ్ల: స్నానం చేసేందుకు స్మిమ్మింగ్‌ పూల్‌లో దిగిన వ్యక్తి నీట మునిగి చనిపోయాడు. ఈ సంఘటన చేవెళ్ల మండలంలోని ఆలూరులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నక్కలపల్లి సత్తయ్య(46) రోజూవారీ కూలీగా ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నాడు. నిత్యం మాదిరిగానే ఉదయాన్నే ఫాంహౌస్‌కు వెళ్లి చెట్లకు నీళ్లు పెట్టి, స్నానం చేసేందుకు సిమ్మింగ్‌ పూల్‌లోకి దిగాడు. ఇదే సమయంలో మూర్ఛ రావడం, సమీపంలో ఎవరూ లేకపోవడంతో నీటమునిగి మృతిచెందాడు. భార్య సువర్ణ పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన రాలేదు. దీంతో అల్లుడు బాలకృష్ణను ఫాంహౌస్‌ వద్దకు పంపించగా, సిమ్మింగ్‌ పూల్‌లో విగత జీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో బయటకు తీయగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement