ఒక్కఫోన్‌ చేస్తే చాలు | - | Sakshi
Sakshi News home page

ఒక్కఫోన్‌ చేస్తే చాలు

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

విస్తరణకు సమాయత్తం కొడంగల్‌ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. 8లోu

విస్తరణకు సమాయత్తం కొడంగల్‌ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.

విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం

ఫిర్యాదులపై తక్షణం స్పందన

క్షేత్రస్థాయికి విద్యుత్‌ సిబ్బంది

రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయం

‘సాక్షి’తో షాద్‌నగర్‌ ట్రాన్స్‌కో డీఈ శ్యాంసుందర్‌రెడ్డి

షాద్‌నగర్‌: ‘రైతులకు విద్యుత్‌ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలిస్తున్నాం. ఒక్క ఫోన్‌ చేస్తే చాలు అంతరాయాలు, ఇతర సాంకేతిక సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నాం. వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న అన్నదాతలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అదనపు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం’ అని షాద్‌నగర్‌ ట్రాన్స్‌కో డీఈ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై డీఈ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

ప్రశ్న: రైతులకు విద్యుత్‌ అందించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: విద్యుత్‌ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాం. గతంలో 9 గంటల విద్యుత్‌ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు అదనంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు గంటలు పెంచాం.

ప్రశ్న: ౖనియోజకవర్గంలో రైతులకు సంబంధించి ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఎంత విద్యుత్‌ అవసరం ఉంది?

జవాబు: 40వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. 112 మెగావాట్ల డిమాండ్‌ ఉంది. ఎల్‌నినో ప్రభావంతో వినియోగం బాగా పెరిగింది. డిమాండ్‌ మేరకు ప్రణాళికాబద్ధంగా సరఫరా చేస్తున్నాం.

ప్రశ్న: ౖక్షేత్ర స్థాయిలో మీ దృష్టికి రాకుండా పలుచోట్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని ఏవిధంగా పరిష్కరిస్తున్నారు?

జవాబు: ప్రతి రోజు ఏదో ఒక గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడుతున్నాం. ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరిస్తున్నాం.

ప్రశ్న: ౖకాలం చెల్లించిన ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, విద్యుత్‌ తీగలతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: ఇప్పటికే చాలామంది రైతులు ఈ సమస్యలు మా దృష్టికి తెచ్చారు. అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం, స్తంభాలు, వైర్లు మార్చి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ప్రస్తుతం వ్యవసాయం విషయంలో విద్యుత్‌ చాలా కీలకం. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం.

ప్రశ్న: ౖరైతులకు సమస్యలు వస్తే అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఎలా అధిగమిస్తారు?

జవాబు: లైన్‌మెన్‌ నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందరం అందుబాటులో ఉంటున్నాం. ఒక్కఫోన్‌ కాల్‌ చేస్తే చాలు సమస్య ఉన్న చోటకు వెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదు. సిబ్బంది స్పందించకపోతే చర్యలు తప్పవు.

ప్రశ్న: ౖలో ఓల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని మున్సిపాలిటీలోని కొన్ని కాలనీవాసులు చెబుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: గతంలో కొన్ని కాలనీల్లో లోఓల్జేజీ సమస్య ఉన్న మాట వాస్తవం. సమస్యలు ఉన్న కాలనీలను గుర్తించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement