విద్యుత్‌ షాక్‌తో కాడెద్దు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో కాడెద్దు మృతి

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

విద్యుత్‌ షాక్‌తో కాడెద్దు మృతి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి.. కారు పల్టీలు కొట్టి రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ.. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సెంటర్‌ పరిశీలన పెండింగ్‌ పనులు పూర్తి చేయండి

షాబాద్‌: విద్యుత్‌ షాక్‌తో కాడెద్దు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఎర్రోనిగూడలో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కొలన్‌ వెంకట్‌రెడ్డి కాడెద్దు శనివారం సాయంత్రం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో మేత మేస్తుండగా షాక్‌ తగిలి మృత్యువాత పడింది. వ్యవసాయ పనులకు ఆ ఎద్దుపైనే ఆధారపడినట్లు, సుమారు రూ.లక్ష నష్టం జరిగినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

షాద్‌నగర్‌రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాద్‌నగర్‌ పట్టణ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. షాబాద్‌ మండలం బోడంపాడ్‌ గ్రామానికి చెందిన చిన్న వెంకటయ్య (40) శనివారం ఉదయం తన కారులో షాద్‌నగర్‌ వస్తున్నాడు. పట్టణ శివారులోని గ్రానైట్‌ పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న చిన్న వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భాస్కర్‌కు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సీతారాం తెలిపారు. చిన్న వెంకటయ్య కారులో మద్యం సీసాలు ఉండడంతో మద్యం తాగి కారును నడిపించినట్లు భావిస్తున్నారు. మద్యం మత్తులో అదుపు తప్పి బైకును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

చేవెళ్ల: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని మహిళ (35–40) రెండు మూడు రోజులుగా ఎన్కేపల్లి చౌరస్తా వద్ద భిక్షాటన చేస్తూ సంచరిస్తోంది. శనివారం మధ్యాహ్నం రోడ్డుపక్కన ఆగి ఉన్న వరికోత యంత్రంపై కూర్చొని ఉంది. విషయం గమనించని డ్రైవర్‌ వాహనం స్టార్ట్‌ చేసి ముందుకు కదిలించడంతో వాహనంపై కూర్చొని ఉన్న ఆమె వాహన వెనుకచక్రాల కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌ గౌతమ్‌దాస్‌ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివారాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.

అనంతగిరి: వికారాబాద్‌లోని జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్‌డ్డ్‌వ్‌ హెడ్‌ క్వార్టర్‌లోని బెల్‌ ఆఫ్‌ ఆర్‌మ్స్‌ను శనివారం ఎస్పీ స్నేహ మెహ్ర తనిఖీ చేశారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మ్యాగజైన్‌ గది, సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఆమె ఎంట ఏఆర్‌ డీఎస్పీ వీరేష్‌, ఆర్‌ఎస్‌ఐలు నాగరాజు, శ్రీశైలంగౌడ్‌, అశోక్‌, ఆర్‌ఎస్‌ఐలు రాములు, బాలాజీ నాయక్‌ తదితరులు ఉన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం ఏఎస్పీ రాజేష్‌ మీనా ఆధ్వర్యంలో జిల్లా ప్రాసిక్యూషన్‌ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ నెలలో నమోదైన గ్రేవ్‌ ఆక్సిటల్‌ కేసులపై సమీక్షించారు. ఈ సమావేశంలో లీగల్‌ అడ్వైజర్‌ అనిల్‌కుమార్‌ పీపీ మెహ్రాజ్‌ ఫిర్దోష్‌, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: సర్‌ ప్రక్రియ పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్‌ఐఆర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదు, తదితర అంశాలపై హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. పలు శాఖ అధికారులతో కలిసి జిల్లాలో పరిస్థితులను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement