అనుమానితులతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

అనుమానితులతో జాగ్రత్త

Oct 18 2026 7:39 AM | Updated on Oct 18 2026 7:39 AM

తాండూరు: కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై జాగ్రత్తగా ఉండటంతో పాటు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య సూ చించారు. ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశం మేరకు శనివారం ఉదయం మున్సిపల్‌ పరిఽధిలోని ఎనిమిదో వార్డు రాజీవ్‌ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ నిర్వహించారు. పట్టణ సీఐ పరమేశ్వర్‌గౌ డ్‌, రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌, సబ్‌ డివిజన్‌ పరిఽధిలోని ఎస్సైలు, 95 మంది పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 9ఆటోలను సీజ్‌ చేశారు. ఓ అనుమానిత వ్యక్తిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు.

డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య

రాజీవ్‌ కాలనీలో విస్తృతంగా తనిఖీలు

సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement