గృహ ప్రవేశానికి వెళ్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

గృహ ప్రవేశానికి వెళ్తుండగా ప్రమాదం

Aug 31 2026 7:58 AM | Updated on Aug 31 2026 7:58 AM

బొంరాస్‌పేట: ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాలవెంకటరమణ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని జానకంపల్లికి చెందిన దూగు చంద్రమ్మ(58) భర్త, కొడుకు చనిపోవడంతో దత్తత తీసుకున్న కుమారిడి వద్ద జీవనం సాగిస్తోంది. ఉదయం దుద్యాల మండలం లగచర్లలో బంధువుల గృహప్రవేశానికి బయలుదేరింది. ఈ క్రమంలో తుంకిమెట్ల జాతీయరహదారి 163పై రోడ్డుదాటుతుండగా హన్వాడ గ్రామానికి చెందిన ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టడంతో ఆమె పడిపోయింది. స్థానికులు ఆమెను కొడంగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, గ్రామస్తులు బంధువులు అంత్యక్రియలు చేశారు. ద్విచక్రవాహనదారుడిని అదుపులోకి తీసుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement