వెంకట క్రాంతి కిరణ్‌కు గిడుగు జాతీయ పురస్కారం కడ్తాల్: మండల పరిధిలోని రావిచేడ్‌కు చెందిన న్యాయ నిపుణుడు, సంఘ సేవకుడు, కవి పుట్టపాక వెంకట క్రాంతి కిరణ్ ప్రతిష్టాత్మక గిడుగు జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిర్వాహకుల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
ఆదివాసీ కాంగ్రెస్ పరిశీలకుడి నియామకం షాద్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ కమిటీల బలోపేతం, ఎన్నిక ప్రక్రియ కోసం జిల్లా కమిటీలకు పరిశీలకులను నియమించారు. ఇందులో భాగంగా షాద్‌నగర్‌కు చెందిన గిరిజన నేత శ్రీను నాయక్‌ను వనపర్తి జిల్లా పరిశీలకుడిగా నియమించారు. ఈ మేరకు పీసీసీ ఆదివాసీ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్‌తో పాటు, నియోజకవర్గంలో మండల స్థాయి అధ్యక్షులను ఎన్నుకునేందుకు తనను అధిష్టానం పరిశీలకుడిగా నియమించినట్లు శ్రీను నాయక్ తెలిపారు.
ఏఐవైఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక తుర్కయంజాల్: ఏఐవైఎఫ్ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా తైలి మధు, పి.శివకుమార్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాగన్నగూడలోని అరుణ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మధు, పి.శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సమావేశంలో మొత్తం 136 మంది ప్రతినిధులు పాల్గొని ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు చేసినట్టు తెలిపారు. జెన్ జడ్ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపనున్నట్టు పేర్కొన్నారు.
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేద్దాం
చేవెళ్ల: అంగన్‌వాడీల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని చేవెళ్ల ఐసీడీఎస్ సీడీపీఓ హెప్సిబా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 31 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని కోరారు. ఖాళీల వివరాలు, అర్హతలు, నియమ నిబంధనలు, పూర్తి వివరాలకు మహిళా శిశుసంక్షేమశా అధికార వెబ్‌సైట్ https://wdcw.tg.nic.in ను సందర్శించాలని సూచించారు.
మూడు పోస్టుల భర్తీకి..
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని కవాడిపల్లి అంగన్‌వాడీ సెంటర్ –1, 2తో పాటు తారమతిపేటలోని అంగన్‌వాడీ సెంటర్ –2లో ఉన్న మూడు అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్‌నగర్ సీడీపీఓ వినీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
కుల్కచర్ల: మాలలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాలలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 31న సెక్రటేరియేట్ ముట్టడించేందుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా పరిధిలోని మాలమహానాడు కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.