ఇందిరమ్మ ఇళ్లకు లక్కీడ్రా | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లకు లక్కీడ్రా

Aug 31 2026 7:58 AM | Updated on Aug 31 2026 7:58 AM

నాగోలు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఆదివారం నాగోలు బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ కార్యాలయంలో నిర్వహించారు. అర్హులైన దరఖాస్తుదారుల్లో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్లాట్లను కేటాయించే ప్రక్రియను ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ హౌసింగ్‌ బోర్డు సౌత్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బాబురావు, హౌసింగ్‌ బోర్డు జనరల్‌ మేనేజర్‌ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. డ్రాలో తమ పేరు వస్తుందా.. సొంతింటి కల నెరవేరుతుందా అని దరఖాస్తుదారులు ఉత్కంఠగా ఎదురుచూశారు. బండ్లగూడలోని హౌసింగ్‌ బోర్డ్‌లో ఏర్పాటు చేస్తున్న టవర్స్‌లో ప్లాట్ల కేటాయింపునకు మొత్తం 752 మంది దరఖాస్తు చేసుకోగా.. లక్కీడ్రా ద్వారా 480 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఎస్సీ కేటగిరీకి 67 ప్లాట్లు, ఎస్టీలకు 24, బీసీలకు 77, దివ్యాంగులకు 24 ప్లాట్లు కేటాయించారు. ఇతర కేటగిరీలకు 240 కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఎంపికై న లబ్ధిదారులు ప్లాట్‌ కోసం రూ.6 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తమకు ప్లాట్‌ దక్కడంతో ఎంపికై న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 480 మందికి ప్లాట్ల కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement