హైవే విస్తరణ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

హైవే విస్తరణ పనుల పరిశీలన

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

మొయినాబాద్‌: గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరిగిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్‌లో జరుగుతున్న హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజాపూర్‌ జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ రోడ్డు నిజాం కాలం నాటిదని.. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం రహదారి పనులు చేపడుతోందన్నారు. కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ పనులను తామే తెచ్చామంటూ సోషల్‌ మీడియాలో డబ్బాకొట్టుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం యాదవ్‌, సీనియర్‌ నాయకులు కంజర్ల ప్రకాష్‌, మోర నర్సింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్‌, కౌన్సిలర్‌ కిషన్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement