షాబాద్: అతి వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పోతుగల్ వద్ద చోటుచేసు కుంది. ఎస్‌ఐ చెన్నారెడ్డి కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల చరణ్ (19) స్నేహితుడు ఎడ్ల స్వాతిక్‌తో కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై షాబాద్ వైపు నుంచి చేవెళ్లకు వెళ్తున్నారు. మార్గమధ్యలో పోతుగల్ సమీపంలో అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి డివైడర్ మఽ ద్యలో ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన చరణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్వాతిక్‌ను చికిత్స నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పి..
కొత్తూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన రాములు ఆదివారం తల్లి లక్ష్మమ్మ (61), కూతురు సంధ్యతో కలిసి బైకుపై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. కొత్తూరు సమీపంలోకి రాగానే పెంజర్ల కూడలి జాతీయ రహదారి వద్ద బైకు అదుపు తప్పి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో ఒకరు..
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు నుంచి ఆదివారం హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి లారీ చక్రాల కిందపడిపోయింది. దీంతో వాహనం నడుపుతున్న గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా వెనుకాల ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
బైక్‌పై వెళ్తున్న విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు


