ధారూరు: డీఏపీ ఎరువులను ఎమ్మార్పీ కంటే అధికధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోవా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధి లోని డీకే తండాకు చెందిన పుల్‌సింగ్, రమేశ్ నాయక్, బాలరాజ్‌నాయక్, మాణిక్‌రావు, కిషిక్టబాయి, బీక్యానాయక్ ఆదివారం వికారాబాద్ లోని శ్రీమహాలక్ష్మి ఏజెన్సీలో ఒక్కొక్కరు ఐదు బస్తాల చొప్పున గత నెల 31 నుంచి ఆదివారం వరకు డీఏపీ కొనుగోలు చేశారు. బస్తాకు రూ.1,350 ఉండగా వారి నుంచి రూ.1,680 వసూలు చేశారు. రైతులు డీలర్‌ను రసీదు ఇవ్వాలని కోరడంతో దుకాణ వివరాలు లేని.. మొత్తం బిల్లు వేయకుండానే రసీదు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తున్నప్పటికీ డీలర్లతో కుమ్మకై ్కన వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద అధికంగా డబ్బు తీసుకున్న డీలర్ నుంచి తిరిగి ఇప్పించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోమవారం ఇదే విషయమై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు.
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు


