కఠిన చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కఠిన చర్యలు తీసుకోవాలి

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

రైతులను మోసం చేసి వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు మళ్లించుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మోసపూరిత ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందో అందరిని విచారించి చర్యలు తీసుకోవాలి. రైతులకు జవాబుదారీగా ఉండాల్సిన ఏపీఎం, ఇతర అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ సంఘటన జరిగింది. ఇందుకు కారణమైన వ్యక్తులు, అఽధికారులపై చర్యలు తీసుకోవాలి.

– మల్కయ్య, బుగ్గప్ప, ప్రజా సంఘాల నాయకులు

మరొకరి ఖాతాలో ఎలా జమ చేస్తారు?

జూన్‌ 21న రాస్నం కొనుగోలు కేంద్రంలో కాశమ్మ పేరిట 116 సంచులు(46 క్వింటాళ్లకు పైగా) వరి ధాన్యం విక్రయించాం. ఇందుకు సంబంధించి రూ.1.10లక్షలకు పైగా నగదు జమ కావాల్సి ఉంది. ప్రతి రోజు స్థానిక ఐకేపీ, వీఓఏలను అడిగినప్పటికీ సమాధానం ఇవ్వలేదు. ఇదే విషయమై ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఏపీఎంను సంప్రదించగా .. అంజిలప్ప ఫోన్‌ చేసి ధాన్యం డబ్బులు తన వద్దే ఉన్నాయని, సాయంత్రం ఇస్తానని చెబుతున్నాడు. మా ధాన్యం డబ్బులు మరొకరి ఖాతాలో ఎలా జమయ్యాయి? ధాన్యం డబ్బులు వచ్చి ఎన్ని రోజులైందనే విషయంలో మాకు తెలియాలి. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

– అనంతయ్య, బాధిత రైతు, రాస్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement