పహాడీషరీఫ్ పీఎస్‌ను
ఆశ్రయించిన బాధితులు
పహాడీషరీఫ్: జల్‌పల్లి గ్రామంలోని ఎన్‌ఆర్‌ఐ ఫస్ట్ సిటీ వెంచర్‌లో ఇరవై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు శనివారం పహాడీషరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. జల్‌పల్లిలోని సర్వే నంబర్ 70, 85లో ఏర్పాటు చేసిన వెంచర్‌లో 602 ప్లాట్లను 2006– 07లో కొనుగోలు చేశామన్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు తమ లేఅవుట్‌ను ఆక్రమిస్తూ దాదాపు 120 ప్లాట్ల చుట్టూ కంచె వేసి, జేసీబీలతో అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయమై ప్లాట్ల యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రదీప్, రాహుల్, సంధ్య, డీఎం రెడ్డి, ఫరూక్‌లు పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో చట్టరీత్యా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
ప్రతిపక్ష పార్టీలపై
వీహెచ్‌పీ నేతల మండిపాటు
హుడాకాంప్లెక్స్: పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్షాలు స్వామీజీ వేషధారణలో ప్రదర్శించిన స్కిట్ హిందూ ధర్మాన్ని, విశ్వాసాలను, మనోభావాలను కించపరిచే విధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం కొత్తపేటలో నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు చేపట్టిన నిరసన హిందూ సమాజాన్ని అవమానించే విధంగా ఉందన్నారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు సుధాకర్, సుధీర్, రామకృష్ణ, బెంగరబోయిన సురేష్, నవకాంత్, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


