ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దు

Aug 2 2026 7:26 AM | Updated on Aug 2 2026 7:26 AM

షాబాద్‌: ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబీకులను పరామర్శించిన అనంతరం మండలంలోని రైతులు ఆయనకు వినతులు అందజేశారు. ఎరువుల విషయంలో ఇబ్బందిగా ఉందని, ఇక్కడ రైతులు ఎక్కడికో వెళ్లి ఎరువులు తీసుకోవాల్సి వస్తుందని విన్నవించారు. యాప్‌ ద్వారా తీసుకోవడం మరీ అంతరాయంగా ఉందన్నారు. వెంటనే ఆ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఫోన్‌ ద్వారా మాట్లాడారు. యాప్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని వారు తెలపగా.. సమస్యలు ఉంటే యాప్‌ను ఎందుకు రైతుల ముందుకు తీసుకు వచ్చారని, రెండు మూడు రోజుల్లో సరిచేసి ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా ఇవ్వాలని తహసీల్దార్‌ అన్వర్‌ను ఆదేశించారు. స్థానిక విలేకరులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రిని కోరారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement