హిందూ చైతన్యమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

హిందూ చైతన్యమే లక్ష్యం

Aug 2 2026 7:26 AM | Updated on Aug 2 2026 7:26 AM

మీర్‌పేట: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల చైతన్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని బీజేపీ మహేశ్వరం ఇన్‌చార్జి అందె శ్రీరాములు యాదవ్‌ అన్నారు. శనివారం జిల్లెలగూడ శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ ఆవరణలోని ఆంజనేయస్వామికి ఆయన ప్రత్యేక పూజలు చేసి స్థానిక నాయకులు గాజుల మధు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించి, సుమారు 100 ఆటోలకు అతికించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జాతీయ భావన, సాంస్కృతిక విలువలు, హిందుత్వ చైతన్యం మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఆటో ఒక సందేశం, హిందుత్వ చైతన్యమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కో–ఆపరేటివ్‌ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ కొలన్‌ శంకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, కీసర గోవర్ధన్‌రెడ్డి, భిక్షపతిచారి, కరుణానిధి, విజయలక్ష్మీరాజు, చెవ్వ శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి

శ్రీరాములుయాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement