ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలి

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

షాద్‌నగర్‌: ప్రభుత్వం ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్‌ పిడమర్తి రవి అన్నారు. సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్‌, గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని కోరారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించుకునేందుకు తెలంగాణ ఉద్యమ కారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, నాయకులు దిలీప్‌కుమార్‌, బోరెళ్లి సురేష్‌, రహీం, జాంగారి రవి, శ్రీనివాస్‌రెడ్డి, నడికూడ యాదగిరి, ఆర్ల యాదయ్య, మేకల వెంకటేశ్‌, రాజు, రవికుమార్‌, బీరప్ప, మల్లేష్‌, మహేందర్‌, విశాల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement