చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు ఏపీకే ఫైల్స్‌ పంపి రూ.6.26 లక్షలు స్వాహా షూటర్‌ ఇర్ఫాన్‌ అరెస్ట్‌

కుల్కచర్ల: అదుపు తప్పిన కారు చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. చెల్లాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుల్కచర్లకు కారులో వస్తుండగా ముందు టైరు పేలడంతో రోడ్డు కిందకు వేగంగా దూసుకెళ్లింది. వాహనంలోని ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి.

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వ్యక్తికి క్రెడిట్‌ కార్డు అప్‌గ్రేడ్‌ పేరుతో సందేశం పంపి, ఏపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేయించడం ద్వారా రూ.6.26 లక్షలు స్వాహా చేయడంపై సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. సైదాబాద్‌కు చెందిన ఓ సేల్స్‌మెన్‌కు బుధవారం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ రుపే క్రెడిట్‌ కార్డు విభాగం అధికారిగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడి వద్ద ఉన్న ఆర్‌బీఎల్‌ వీసా క్రెడిట్‌ కార్డును ఆర్‌బీఎల్‌ రుపే క్రెడిట్‌ కార్డుగా అప్‌గ్రేడ్‌ చేస్తానని చెప్పాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో వాట్సాప్‌ ద్వారా ఏపీకే ఫైల్స్‌తో కూడిన లింకులు పంపాడు. వాటిని ఇన్‌స్టాల్‌ చేయించి బాధితుడి బ్యాంకు ఖాతా, క్రెడిట్‌ కార్డు నుంచి రూ.6.26 లక్షలు కాజేశారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మణికొండ: దారిదోపిడీ, ఇళ్లలో దొంగతనాలు, బలవంతపు వసూళ్లు, తీవ్రమైన నేరాలతో పాటు మొత్తం 41 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ అలియాస్‌ షూటర్‌ ఇర్ఫాన్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 6వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో నిందితునితో పాటు అతని సహచరులు చేతన్‌, అల్హాన్‌ హుస్సేన్‌, సోహెల్‌, మహమ్మద్‌ సమీర్‌లతో కలిసి పోలీస్‌ అకాడమీ రోటరీ సమీపంలో పాదచారులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడాలనే పథకం వేశారు. ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ఇద్దరు బాధితులను బలవంతంగా అపహరించి బ్రాడ్‌వే హోటల్‌ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లారు. కత్తులతో బెదిరించి రూ.1050 నగదు, ఆన్‌లైన్‌లో రూ. 10వేలు, రెండు పవర్‌ బ్యాంక్‌లను దోచుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు గురువారం షూటర్‌ ఇర్ఫాన్‌ను పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్‌ విధించారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement