షాద్‌నగర్: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నందిగామ సీఐ వీరబాబు అన్నారు. శుక్రవారం నందిగామ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. 80 వాహనాలు తనిఖీ చేసి 53 వాహనాలకు పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్ చేయించారు. ఎనిమిది మంది వాహనదారులకు స్పాట్ చలాన్లు విధించారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపిస్తున్న వాహనదారుడి నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వీరబాబు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రతి వాహనదారుడి వద్ద వాహనాలకు సంబంధించిన అన్ని ప్రతాలు ఉండాలని సూచించారు.
నందిగామ సీఐ వీరబాబు


