రూ.30 వేల జరిమానా
మొయినాబాద్: ఆరు చెట్లకు అనుమతి తీసుకుని అక్రమంగా 38 వేప చెట్లు నరికినవారిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి జరిమానా విధించారు. అజీజ్‌నగర్ రెవెన్యూ సర్వేనంబర్ 11లో నగరానికి చెందిన సయ్యద్ సర్వర్ అహ్మద్ ఖాద్రీ నదీంకు ఎకరం భూమి ఉంది. ఇందులోని ఆరు చెట్లను తొలగించడం కోసం ఇటీవల ఫారెస్ట్ అధికారుల వద్ద అనుమతి తీసుకున్నారు. కానీ, మొత్తం 38 వేపచెట్లను నరికివేశారు. విషయం తెలుసుకున్న చిలుకూరు ఫారెస్ట్ అధికారులు బుధవారం అక్కడికి చేరుకుని పరిశీలించారు. చెట్లను నరికేందుకు వినియోగించిన సామగ్రితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, రూ.30 వేల జరిమానా విధించినట్లు సెక్షన్ ఆఫీసర్ మమత తెలిపారు.


