ధారూరు: చోరీకి గురైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని గురువారం బాధితులకు అప్పగించామని ధారూరు ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపారు. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్, ధారూరు మండలం దోర్నాల్‌తండాకు చెందిన రవీందర్, నాగర్‌కర్నూల్‌కు చెందిన శ్రీశైలంకు సెల్‌ఫోన్లు అందజేశామని స్పష్టంచేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు విక్రయించే ఫోన్లను కొనుగోలు చేయొద్దని తెలిపారు.


