సమష్టిగా పని చేయండి | - | Sakshi
Sakshi News home page

సమష్టిగా పని చేయండి

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్‌

సమసల్యను ఏకరువు పెట్టిన సర్పంచ్‌లు

మొయినాబాద్‌రూరల్‌: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకునేందుకు అధికారులు సర్పంచ్‌లతో కలిసి పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ హిమబిందు అధ్యక్షతన మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లతో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 20 అంశాలతో కూడిన ఎజెండా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీల సర్పంచ్‌లు సమస్యలు సభ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. అనంతరం డీపీఓ సురేశ్‌మోహన్‌ మాట్లాడుతూ.. జలసిరిలో గ్రామానికి కనీసం నాలుగు ఊరు కుంటలపైనే నిర్మించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. వనమహోత్సవంలో భాగంగా ప్రతీ గ్రామంలో 6 వేల మొక్కలు నాటాలన్నారు. ఇంటి పన్నులు విధిగా వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కిషన్‌రావు, ఎంఈఓ శ్రీనివాసులు గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, ఎంపీఓ విక్రాంత్‌రెడ్డి, వ్యవసాయ అఽధికారి అనురాధారెడ్డి, ఆరోగ్య వైద్య అధికారి అన్నపూర్ణ, మండల విద్యుత్‌ అధికారులు అమయ్‌, శివరామకృష్ణ, సర్పంచ్‌లు ప్రవీణ్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, రాజేందర్‌రెడ్డి, శ్రీదివ్యమురళీధర్‌రెడ్డి, శ్రీనివాసులు, మాణిక్యం, పాషా, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement