డిమాండ్‌కు అనుగుణంగా.. విద్యుత్ సరఫరా సామర్థ్యం పెంచుతున్నామని రాజేంద్రనగర్ విద్యుత్ ఎస్‌ఈ శ్రీరామ్ మోహన్ పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ఈ కామర్స్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తల సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. జిల్లాలో ఎగుమతులను పెంచడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించేందుకు డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్‌పోర్ట్ హబ్(డీఈహెచ్) కార్యక్రమం కింద మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) అధికారుల సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ–డీఐ కామర్స్ ఎక్స్‌పోర్ట్ శాఖ నాబార్డు, ఈసీజీసీ ఇండియా పోస్ట్ తదితర ఎగుమతి ప్రోత్సాహ సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఎగుమతులకు సంబంధించిన ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, ఎగుమతి విధానాలు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఆర్థిక సహాయం, ఈ కామర్స్ ద్వారా వ్యాపార విస్తరణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు, స్టార్టప్ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎగుమతులపై ఆసక్తి ఉన్న వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మ్యాపింగ్ డేటా ఆధారంగా నిర్ణయాలు
సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫాంల ఆన్‌లైన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మ్యాపింగ్ అనంతరం అందిన డేటా ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హేతుబద్ధీకరణలో ప్రతీ పోలింగ్ కేంద్రంలో సాధ్యమైనంత వరకు 1,200 మంది ఓటర్ల పరిమితిని పాటించడంతో పాటు, ఒకే కాలనీ లేదా ఒకే నివాస సముదాయానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గాలు, మండలాల్లో సమావేశాలు నిర్వహించి పెండింగ్ అంశాల వివరాలను వారికి అందజేశామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శారద, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


